• Login / Register
  • National News - LPG | భారీగా పెరిగిన‌ ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర‌లు

    National News - LPG | భారీగా పెరిగిన‌ ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర‌లు
    న‌వంబ‌ర్ 1 నుంచే అమ‌ల్లోకి వ‌చ్చిన పెరిగిన ధ‌ర‌లు
    గ్రుహ వినియోగ సిలిండ‌ర్ల‌పై ప్ర‌భావం చూపని ధ‌ర‌లు

    Hyderabad : దేశ వ్యాప్తంగా ఎల్‌పీజీ సిలండ‌ర్ ధ‌ర‌లు భారీగా పెరిగాయి.  వాణిజ్యానికి చెందిన 19 కేజీల ఎల్‌పీసీ సిలిండ‌ర్ ధ‌ర రూ.1802 కు పెంచారు. సిలిండ‌ర్ ధ‌ర అమాంతం  రూ.62 పెంచిన‌ట్లు తెలిపారు. ఈ మేర‌కు దీశీయంగా ఉన్న చ‌మురు కంపెనీలు నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో దీపావ‌ళి పండ‌గ సంద‌ర్భంగా గ్యాస్ వినియోగ‌దారుల‌కు చ‌మురు కంపెనీలు పెద్ద షాక్ ఇచ్చాయి. అయితే పెరిగిన ధ‌ర‌లు న‌వంబ‌ర్ 1 నుంచే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించ‌డం మ‌రో విశేషం. స‌రిచేసిన సిలిండ‌ర్ ధ‌ర‌లు చూసిన‌ట్ల‌యితే ఢిల్లీ,  ముంబై, చెన్నైతో పాటు కోల్‌క‌తాలో  19 కేజీల ఎల్‌పీజీ  గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర కూడా పెరిగింద‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుత ధ‌ర‌లు చూస్తే ముంబైలో రూ.1754.50, చెన్నైలో రూ.1964.50,  కోల్‌క‌తాలో రూ.19511.50 గా ఉన్న‌ట్లు చెప్పుతున్నారు. ప్ర‌స్తుతం గ్రుహ వినియోగం కోసం ఎల్‌పీజీ సిలండ‌ర్ల జోలికి వెళ్ల‌డం లేద‌ని తెలుస్తుంది. కాని వాణిజ్య సిలండ‌ర్ ధ‌ర‌లు పెరుగ‌డం ఇది వ‌రుస‌గా నాలుగో సారిగా భావిస్తున్నారు. అయితే దేశంలో 2024 మార్చి త‌ర్వాత డొమెస్టిక్ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌లో ఎలాంటి మార్పులు తీసుకురాలేదు. పైగా డెమెస్టిక్ సిలిండ‌ర్‌పై రూ.100 త‌గ్గిస్తూ నిర్ణ‌యం కూడా తీసుకున్నారు. అంతకు ముందు 2023 ఆగస్టు 29న ఇంటి అవ‌స‌రాల కోసం గ్యాస్ సిలిండర్ ధర రూ.200 తగ్గించింది. ఆ త‌ర్వ‌త  నుంచి  డొమెస్టిక్‌ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవ‌డం కొంత వ‌ర‌కు స‌బ‌బు అనే భావ‌న‌. అయితే ఢిల్లీలో 14 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.803గా ఉండగా కోల్‌కతాలో రూ.829, ముంబైలో రూ.802.50, చెన్నైలో రూ.818.50, విజయవాడలో రూ.827.50గా ఉంది. హైదరాబాద్‌లో మాత్రం పై అన్ని నగరాలతో పోల్చితే అత్యధికంగా రూ.855కు లభిస్తుంది. 
    దేశీయంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగ‌డం వరుసగా ఇది నాలుగో సారి అవుతుంది.  దేశ రాజధాని ఢిల్లీ, ముంబైలలో కూడా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.62 పెరిగింది. ఆ తర్వాత రెండు మెట్రో న‌గ‌రాలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర వరుసగా రూ.1,802, రూ.1,754.50గా మారింది. కోల్‌కతాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలో రూ.61 పెరుగుదలతో రూ.1911.50కు చేరుకుంది. చెన్నైలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.61.5 పెరిగి ఆ తర్వాత రూ.1964.50గా మారింది. గత నాలుగు నెలలుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.150కి పైగా పెరిగింది. చ‌మురు కంపెనీల నివేదికల ప్రకారం చూస్తే.. ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.156 పెరిగింది. కోల్‌కతాలో 4 నెలల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.155.5 పెరిగింది. ముంబైలో అత్యధికంగా పెరుగుదల కనిపించింది. దీంతో నాలుగు నెలల్లో రూ.156.5 వ‌ర‌కు ధరలు పెరిగాయి. అలాగే సౌత్  ఇండియాలోని పెద్ద నగరం చెన్నైలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.155 పెరిగింది. 

    Leave A Comment